హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం పోలీస్, విద్యుత్తు, హెల్త్, ఆర్అండ్బీ అధికారులతో డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, హెల్ సెక్రటరీ రిజ్వి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ అశోక్‌రెడ్డి తదితరులున్నారు.