Dipu Chandra Das | ఎన్నికల వేళ దీపుదాస్ కుటుంబానికి బంగ్లాదేశ్ పరిహారం.. హత్య జరిగిన రెండు నెలలకు
Dipu Chandra Das : బంగ్లాదేశ్‌లో హిందువు అయిన దీపుచంద్రదాస్పై దాడి చేసి, సజీవ దహనం చేశారు. హత్య జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అతడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది.
Dipu Chandra Das : బంగ్లాదేశ్‌లో హిందువు అయిన దీపుచంద్రదాస్ను అక్కడి అల్లరి మూకలు ఎంత దారుణంగా హత్య చేశాయో తెలిసిందే. అతడిపై దాడి చేసి, సజీవ దహనం చేశారు. బంగ్లాదేశ్‌లోని మిమెన్‌సింగ్ జిల్లాలో డిసెంబర్ 18న ఈ ఘటన జరిగింది. హత్య జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అతడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది.
అది కూడా రెండు రోజుల్లో అక్కడ జాతీయ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిహారం ప్రకటించింది. దీని ప్రకారం.. దీపుదాస్ కుటుంబానికి 25 లక్షల టాకాలు (స్థానిక కరెన్సీ) అందజేస్తారు. ఈ డబ్బును పునరావాస సహాయం కింద అతడి కుటుంబం ఇల్లు నిర్మించుకోవడానికి వాడుకోవాలి. నేషనల్ హౌజింగ్ అథారిటీ ఆధ్వర్యంలో, తారకండా ఐరాస సంస్థ పర్యవేక్షణలో 25 లక్షల టాకాలతో ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తారు. దీంతోపాటు అతడి తండ్రి, భార్యకు 10 లక్షల టాకాలు ఆర్థిక సాయంగా, నగదు రూపంలో అందజేస్తారు. అలాగే ఐదు లక్షల టాకాలు అతడి కూతురు పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పరిహారం ప్రకటించిన సందర్భంగా అక్కడి ఎడ్యుకేషన్ అడ్వైజర్ అక్బర్ మాట్లాడుతూ.. దీపుదాస్ హత్యలాంటి ఘటనలకు సమాజంలో తావులేదన్నారు.
అతడి కుటుంబానికి అవసరమైన సాయం అందించి, అండగా ఉంటామని ప్రకటించారు. ఇలాంటి హత్య ఘటనలు జాతికి అవమానకరం అన్నారు. ఇక.. బంగ్లాలో వరుసగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

