హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులేనని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 2025న మార్చి 29న ఖాళీ కాబోతున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ మరియు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని టీచర్లను కోరారు.ఈ మేరకు డీఈవోలు, కలెక్టర్లకు సమాచారం అందించినట్టు తెలిపారు.