హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు స్వేచ్ఛనివ్వకుండా అధికారుల పెత్తనం కొనసాగిస్తున్నదని జేఏసీ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ విమర్శించారు. కార్యనిర్వహణాధికారుల నిరంకుశ వైఖరివల్ల అర్చ కులు స్వేచ్ఛగా విధులు నిర్వహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవలు, ముహూర్తాల నిర్ణారణ, యాగాలు, కుంభాభిషేకాలు, పండుగలు తదితర అంశాల్లో ఆలయాలకే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పింరని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ జేఏసీ తరఫున జీ హర్షవర్ధన్‌రెడ్డిని రెండుస్థానాల్లో ఓ స్థానం నుంచి బరిలో దింపాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం సమావేశమైన జేఏసీ నేతలు తమ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డిని ప్రకటించారు. సమావేశంలో జేఏసీ నేతలు మణిపాల్‌రెడ్డి, పర్వతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ అధ్యాపకుల ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. సివిల్, ఈఈఈ, మెకానికల్ లెక్చరర్ల ఎంపిక జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీజీపీఎస్సీ సెక్రటరీ నికోలస్ తెలిపారు.