బాసర, మే 21 : బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌పై దాడి ఘటనలో తహసీల్దార్ ఎదుట పూజారిని బైండోవర్ చేయడం అన్యాయమని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ అవినా శ్ కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సై శ్రావణికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆంధ్ర స్వాములోరి వేద పాఠశాలలో ఒక విద్యార్థిపై దాడి, ఒక విద్యార్థి మృతి, గోదావరి ఘాట్ కబ్జా, గోదావరి నిత్యహారతి కార్యక్రమం, శాస్ర్తానికి విరుద్ధంగా నాలుకపై బీజాక్షరాలు రాయడం లాంటి ఘటనల్లో పోలీసుల విచారణ కొనసాగుతున్నది.
వేద పాఠశాల స్వామీజీ అనుచరు డు నూకం రామారావు బాసర ఆలయ ప్రధా న అర్చకుడు సంజీవ్ పూజారి వాకింగ్‌కి వె ళ్తుండగా దాడి చేసిన ఘటనలో పూజారి ఫి ర్యాదుతో రామారావును అరెస్టు చేయకుం డా, తిరిగి రామారావు పూజారిపై ఇచ్చిన ఫి ర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు బాసరకు వచ్చి సంజీవ్ పూజారికి సంఘీభావం తెలిపారు. పూజారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేయడం అన్యాయ ని మండిపడ్డారు. రామారావుపై చర్యలు తీసుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.