ఖైరతాబాద్, అక్టోబర్ 9 : లంబాడీలకు ఏదో చేస్తారని చేతిగుర్తుకు ఓటేస్తే హ్యాండిచ్చారని, 40 లక్షల మంది జనాభా ఉన్న తమకు మంత్రి పదవి ఇవ్వకుండా వంచించారని నంగారాభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ గణేశ్‌నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారాతో కలిసి మాట్లాడారు. అనంతరం ముట్టడి కార్యక్రమ పోస్టర్లను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనునాయక్‌తో కలిసి విడుదల చేశారు.
ప్రత్యేక తెలంగాణ వృద్ధి కొనసాగింది: బాబు
హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అభివృద్ధి కొనసాగిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఉండవల్లి నివాసంలో బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలను వివరించారు. సమైక్యాంధ్రలో తెలంగాణ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని చెప్పారు.