హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో ధనవంతుడికి లభించినట్టుగా పేదవారికి న్యాయం లభించడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ధనవంతులతో సమానంగా పేదలకు కూడా న్యాయం అందేలా మార్పులు రావాల ని ఆకాంక్షించారు. ఇందుకు న్యాయ పట్టాలు అందుకున్న యువత కృషి చే యాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవ సభ శనివారం వర్సి టీ ఆవరణలో వైభవంగా జరిగింది. హాజరైన రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ.. న్యాయ పట్టాలతో బయటకు వస్తున్న యువత తమ దృష్టిని అట్టడుగు వర్గాలపైన, సామాజిక న్యాయంపైన కేంద్రీకరించాలని నొకి చెప్పారు.
మహిళలపై అఘాయిత్యాల నివారణ కు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, మహిళా న్యాయవిద్యార్థినుల తో కూడిన జాతీయస్థాయి నెట్వర్ ఏర్పాటుచేయాలని నల్సార్‌కు రాష్ట్రపతి ముర్ము సూచించారు. పలు రంగాల్లో ముందంజలో ఉన్న నల్సార్, తన పూర్వ విద్యార్థులతో సహా ఇతర వర్గాల మద్దతును కూడగట్టి నెట్వర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో అసాధారణ ప్రతిభతో బంగారు పతకాలు పొందిన విద్యార్థులను రాష్ట్రపతి అభినందించారు. నల్సార్ చాన్స్‌ల ర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే స్నాతకోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు స్వాగతం పలికారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సిం హ, సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ములుగు గ్రామపంచాయతీని ము న్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత క వినతిపత్రం అందజేశారు. రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదిముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక, పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.