President | హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భద్రతా చర్యలపై నిమగ్నమయ్యారు. ఇక 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. మ. 1.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని, అక్కడే లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3.25 గంటల వరకు రాజ్‌భవన్‌లోనే రాష్ట్రపతి విశ్రాంతి తీసుకోనున్నారు.
మ. 3.50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి రాజ్‌భవన్‌లోనే ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరనున్నారు.