హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తేతెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనకు తిరుమల రానున్నారు. 20వ తేదీన తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తిరుమల చేరుకుంటారు. ఆలయ సంప్రదాయ ప్రకారం నవంబర్ 21న రాష్ట్రపతి ముందుగా వరాహస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు.