హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సీ ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించింది. ఏ సంస్థకు కట్టబెట్టింది, ఎవరికిచ్చిందన్నది మాత్రం కమిషన్ అత్యంత గోప్యంగా ఉంచింది. ప్రశ్నపత్రాల రూపకల్పనతోపాటు ముద్రణ, ప్యాకింగ్, ర వాణా బాధ్యతలనూ ఔట్సోర్సింగ్కే అప్పగించింది. దీంతో గోప్యత ప్రశ్నార్థకంగా మా రిందని, ఆ సంస్థ ప్రశ్నలను లీక్‌చేసి ఉంటే పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నపత్రాల తయారీ ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడంతో అనేక తప్పులు వెలుగుచూశాయి. శనివారం ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయగా.. మూడు పేపర్లలో ఒక్కో ప్రశ్న చొప్పున మూడు ప్రశ్నలను కమిషన్ తొలగించింది. పేపర్-1లో 73వ ప్రశ్న, పేపర్-2లో 30వ ప్రశ్న, పేపర్-4లో 123వ ప్రశ్నను తొలగించారు. దీంతో మొత్తం 600 మార్కులకు బదులు 597 మార్కులనే పరిగణిలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల తర్వాత మరికొన్ని ప్రశ్నలపై ఎఫెక్ట్ పడనున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
టీజీపీస్సీకి చైర్మన్, సెక్రటరీ సహా ఐదుగురు సభ్యులు, రెగ్యులర్ ఉద్యోగులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు. అయినా పేపర్ల తయారీని ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడంపై విమర్శలొస్తున్నా యి. అంతేకాకుండా పరీక్షల్లో దాదాపు 13 ప్రశ్నలు ఏపీకు సంబంధించినవి ఇచ్చారు. దీనిపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పందిస్తూ.. ‘ఆ ప్రశ్నలు లేకుండా ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.