హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2020 జూలై 13న టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ (ప్రాథమిక అనుమతులు) జారీచేసిన ప్రాజెక్ట్‌కు కొత్తగా ఎంవోయూ చేసుకోవడం ఎక్కడైనా జరుగుతుందా? ఇలా చేసుకోవడం సాధ్యమేనా? అంటే తెలంగాణలో మాత్రం సాధ్యమే అనే జవాబు వస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల డొల్లతనానికి ఈ ఒక్క ఉదాహరణే నిదర్శనం. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలు పాత సీసా లో కొత్త సారా సామెతను తలపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఐదు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లకు గతంలోనే సీఈఏ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జారీచేసింది. ములుగు జిల్లా ఇప్పగూడెంలో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌కు 2020 జూలై 13న టీవోఆర్ జారీచేసింది. ఆదిలాబాద్ జిల్లా రాణాపూర్లో శ్రీసిద్ధార్థ్ ఇన్‌ఫ్రాటెక్‌కు 2022 డిసెంబర్ 8న, గ్రీన్కో ఎనర్జీ సంస్థకు 2023 ఏప్రిల్ 17న, నిజామాబాద్ జిల్లాలో ఆస్తా గ్రీన్ఎనర్జీ వెంచ ర్స్ లిమిటెడ్‌కు 2023 జూన్ 7న, కుమ్రంభీం జిల్లాలో సెరులీన్ సొల్యూషన్స్‌కు 2023 జూన్ 7న సీఈఏ టీవోఆర్ జారీచేసింది. ఇప్పుడు మళ్లీ ఇదే ఐదు సంస్థలతో 7,460 మెగావాట్ల ప్లాంట్ల ను రూ.46,650 కోట్లతో నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నది. సీఈఏ మాత్రం 7,150 మెగావాట్లకు టీవోఆర్ జారీచేసింది.
సీఈఏ టీవోఆర్ జారీచేసిన తర్వాత ఐదు ప్రాజెక్ట్‌లపై ఎన్విరాన్మెంటల్ ఇంప్టాక్ అసెస్మెంట్ జరగాల్సి ఉన్నది. ఆ తర్వాత ప్రాజెక్ట్ ప్రతిపాదిత ప్రదేశంలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను ఆ సంస్థలు విడుదల చేసిన తర్వాత ప్రజాభిప్రాయసేకరణ జరుపుతారు. వీటన్నింటినీ కేంద్ర పర్యావరణ మం త్రిత్వ శాఖకు అందజేసి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో ప్రాజెక్ట్‌ను నిర్మించుకోవాల్సి ఉండగా అదే కం పెనీలతో ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరం.
ఎకోరెన్ ఇండియా ఎనర్జీ లిమిటెడ్ ఈ ఏడాదిలోనే టీజీ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నది. 3,279 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్, 1,650 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్, 650 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ సంస్థ ఒప్పందం చేసుకున్నది. మళ్లీ ఇప్పుడు రూ.16 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఎకోరెన్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఒప్పందం జరిగి ఏడా ది సమీపిస్తున్నా ఇంతవరకు పెట్టుబడులు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ ఇదే సంస్థ కొత్త పెట్టుబడులంటూ ఎంవోయూ కుదుర్చుకున్నది.
ఎంపీఎల్ లాజిస్టిక్స్ చిట్యాలలో రూ.750 కోట్లతో మల్టీపొడక్ట్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 2023 జూలైలోనే ఈ సంస్థ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటుచేసింది.
రిధిర గ్రూప్‌తో సెప్టెంబర్‌లో టూరిజం కాన్క్లేవ్లో భాగంగా ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకున్నది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో రిధిర జెన్ పేరు తో రూ.200 కోట్లతో ఫైవ్‌స్టార్ బ్రాండెడ్ రిసార్ట్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇంతవరకు అడుగు కూడా ముందుకుపడలేదు. తాజాగా ఇదే సంస్థ యాచారంలో రూ.120 కోట్లతో నోవాటెల్ బ్రాండెడ్ హాస్పిటల్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నది.