నమస్తే నెట్వర్క్, మే 27: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు కట్టడిచేశారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్, కన్నెపల్లి, కాసిపేట, మందమర్రి మండలాల్లోని ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జనాభా లెకల షెడ్యూల్ విడుదల చేయాలి ; జాతీయ బీసీ దళ్ డిమాండ్
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కులగణన నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని జాతీయ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జనాభా గణనతోపాటు కులగణనను నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులగణనను తక్షణమే చేపట్టి, జనాభా లెకల షెడ్యూల్ను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం అవసరమైన డా టా సేకరణ జరగాలని అన్నారు.