హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 మధ్య రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చల్లో బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించాలని ఇటీవల ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో 2017 నుంచి 2024 మధ్యకాలంలో రిటైర్డ్ అయిన వారికి ఎంత చెల్లించాల్సి ఉందో లెక్కకట్టి మొత్తాన్ని చెల్లించేందుకు అన్ని డిపోల్లో రిటైర్డ్ అయిన వారి వివరాలను డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్లు సేకరిస్తున్నారు.