భగీరథ్‌ను అరెస్టు చేయాలి
‘బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి. బాలికపై అనేక దఫాలు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదికూడా తండ్రి బండి సంజయ్ ఉన్నప్పటికీ భగీరథ్ మేనమామ సీహెచ్ వంశీకృష్ణకు నోటీసు ఇచ్చి పోలీసుస్టేషన్‌కు తీసుకురావాలనడం దుర్మార్గం.
- రేవంత్, బండి సంజయ్‌ది చీకటి స్నేహం
- అందుకే బలహీనపడిన పోక్సో కేసు
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ
వనపర్తి, మే 13 (నమస్తే తెలంగాణ): ‘బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి. బాలికపై అనేక దఫాలు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదికూడా తండ్రి బండి సంజయ్ ఉన్నప్పటికీ భగీరథ్ మేనమామ సీహెచ్ వంశీకృష్ణకు నోటీసు ఇచ్చి పోలీసుస్టేషన్‌కు తీసుకురావాలనడం దుర్మార్గం. రేవంత్, బండి సంజయ్ చీకటి దోస్తానాతో పోక్సో కేసు బలహీనపడింది’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు.
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బాలిక తల్లి వెళ్లి ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇటు రాష్ట్ర సీఎం, హోం శాఖ మంత్రిగా రేవంత్ కొనసాగుతుండగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పనిచేస్తున్నారని చెప్పారు.
వీరిద్దరి పరిధిలోనే పోలీసు వ్యవస్థ పని చేస్తున్నదని వెల్లడించారు. లైంగికదాడి ఘటనపై బీఆర్ఎస్తోపాటు పలు ప్రజాసంఘాలు పోరాటం చేయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. నిందితుడికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా వంత పాడుతుందో ప్రజలు గమనించాలన్నారు. సంజయ్ ఇటీవల హనుమాన్ జయంతిలో తనకు అడ్డొచ్చిన వారి సంగతి చూస్తా? అంటూ బహిరంగంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హెచ్చరికలతో ప్రసంగాలు చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని నిలదీశారు. మీడియాను సంజయ్ గుప్పిట్లో పెట్టుకుని కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

