నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పబ్లిక్ ప్రా సిక్యూటర్ సాంబశివారెడ్డికి న్యాయవాది నోటీసులు ఇచ్చారు. కాగా, విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ జిల్లా జడ్జి రమాకాంత్ ఉత్తర్వులు చేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని పీపీని ఆదేశించారు. కేసులో రెం డో నిందితుడిగా ప్రణీత్‌రావు 11 నెలలుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉ న్న విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావుకు సుప్రీం, హైకోర్టులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిం ది. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావుకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.