Prakash Ambedkar | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్‌ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ భోజనం చేశారు. అనంతరం విగ్రహావిష్కరణ కోసం ప్రగతి భవన్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌తో పాటు ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించనున్నారు.
Hon'ble CM Sri KCR felicitated Prakash Ambedkar ji in Pragathi Bhavan today. pic.twitter.com/D40shYd5OZ
— Balka Suman (@balkasumantrs) April 14, 2023