హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నస్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ విచారించింది. సిట్ అధికారులు ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11.30 గంటలకు సిట్ ముందు విచారణకు ఆయన హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో సిట్ అధికారులు ప్రభాకర్‌రావును విచారించారు.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏసీపీ వెంకటగిరి సహా ఐదుగు రు సభ్యుల బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించింది. ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లను ముందు పెట్టి విచారణ చేపట్టింది. విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ సందర్భంగా హార్డ్డిస్ ధ్వంసంతో తనకు సంబంధం లేదని ప్రభాకర్ రావు తెలిపారు. తాను సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేసినట్టు ప్రభాకర్‌రావు అధికారులకు తెలిపారు. అయితే హార్డ్ డిస్లు రాత్రి 8:30 నిమిషాలకు ధ్వం సం అయ్యినట్టు ఛార్జ్‌షీట్‌లో చూశానన్నారు. గురువారం మరోసారి విచారణకు రావాలని, రెండు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ వెంట తీసుకురావాలని అధికారులు ప్రభాకర్‌రావును ఆదేశించారు.