హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలు రుణమాఫీ, రైతుభరోసా హామీలను నమ్మి ఓటేశారని, ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం కమిటీలు వేయడమంటే ప్రజాతీర్పును అగౌరవపర్చడమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న వేళ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడమంటే ప్రజాధనం వృథా చేయడమేనని, ఆ పదవులను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ను కలుస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ హాజరవుతారని పేర్కొన్నారు.