మహబూబ్ సెప్టెంబర్ 14 : మహబూబ్నగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సబ్ డివిజన్ కార్యాలయాలను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాలమూరు జిల్లా నుంచి వేరేచోటకు వలసలు వెళ్లేవారని.. భవిష్యత్తులో జిల్లాను బతుకుదెరువుకు కేరాఫ్ అడ్రస్ మారుస్తామని తెలిపారు.
చిన్న జిల్లాలతో అధికారులు ప్రజలకు చేరువకావడంతో సమస్యలన్నీ వేగంగా పరిష్కారం అవుతాయన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల నాయకుల అసత్యాలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ స్వర్ణాసుధాకర్ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అధికారులు పాల్గొన్నారు.