జ్యోతినగర్, మార్చి 22: రామగుండం ఎన్టీపీసీలో తక్కువ లోడ్ సా మర్థ్యంతో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎన్టీపీసీలో పలు యూనిట్ల నుంచి 1,900 మెగావాట్లను తగ్గించడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుదల కనిపిస్తుం ది. థర్మల్ యూనిట్ల నుంచి ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికార వర్గాల ద్వారా సమాచారం. 2,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్టీపీసీలోని 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లు, 500 మెగావాట్ల ఐదో యూనిట్లో ఆదివారం వి ద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు.
800 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఒక్కటో యూనిట్ ను శనివారం నుంచి ఆఫ్‌లో ఉంచా రు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4, 6 యూనిట్లలో పరిమితి లోడ్ తో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల రెండో యూనిట్లో మాత్రమే ఉత్పత్తి జరుగుతున్న ది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి నెలకొనడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పగటిపూట సౌర, జల, వాయు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై డిమాండ్ తగ్గుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్ధేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనకు రామగుండం ఎన్టీపీసీ సాధ్యం కాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.