బెల్లంపల్లి, ఆగస్టు 10 : సింగరేణి క్వార్టర్లకు తొలగించిన విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిబస్తీ, కన్నాల బస్తీ, బూడిదగడ్డ బస్తీలకు చెందిన మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని సివిక్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మూడు రోజుల క్రితం విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేవరకు సింగరేణి కరెంట్ సరఫరా చేస్తుందని, ఈ మేరకు సింగరేణి సీఎండీతో మాట్లాడినట్టు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఓ ప్రకటనలో తెలిపాపరు.