దుబ్బాక, నవంబర్ 24 : సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల దవాఖానలో రోగులకు కరెంట్ కష్టాలు ఎదురయ్యాయి. సోమవారం గంటల తరబడి కరెంట్ కోతతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. డయాలసిస్, ఎక్స్రే, ఈసీజీ పరీక్షల కోసం వచ్చిన రోగులకు చీకటిలో వైద్య పరీక్షలు చేయడం వైద్యులు, సిబ్బందికి సమస్యగా మారింది. ఓ పక్క కరెంట్ కోత.. మరోపక్క జనరేటర్ మరమ్మతులు చేపట్టకపోవడంతో దవాఖానలనో అంధకారంలో నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కారు వైద్యం పేదలకు సమస్యగా మారిందని విమర్శలు నెలకొన్నాయి.