Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Ponguleti Srinivas Reddy | రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలేవీ పట్టనట్టుగా .. ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయగలిగాం. చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవలే అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉందో మరోసారి తేటతెల్లమైంది.
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరైన నాణ్యమైన కరెంట్ లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు గృహ వినియోగదారులు కూడా కరెంట్ కోతలతో సతమతమవుతున్నారు. అయితే ఇవేవీ పట్టనట్టుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కరెంట్ గురించి మాట్లాడుతూ.. ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయగలిగాం. చేస్తున్నాం కూడా అని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉందో మరోసారి తేటతెల్లమైంది.
స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్న సమావేశంలోనే కరెంట్ పోయింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దుతుగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైక్ తీసుకొని మాట్లాడుతుండగా మధ్యలో కరెంట్ పోయింది. సాక్షాత్తు మంత్రులే పాల్గొన్న ముఖ్యమైన మీటింగ్‌లో ఇలా కరెంట్ పోవడం రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతోంది.
మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా కరెంట్ కట్
కరెంట్ కోతలు లేవన్న భట్టి కార్యక్రమంలోనే పవర్ కట్స్ https://t.co/aCvqyRVSPD
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

