Power Cut | నయీంనగర్, మే 16 : కాంగ్రెస్ పాలనలో కరెంటు పోవడం రివాజుగా మారింది. మంత్రి కొండా సురేఖ ప్రెస్మీట్లో మరోసారి ఇదే జరిగింది. శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కమీషన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తున్న సమయంలో కరెంట్ పోయింది. నాలుగున్నర నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాంగ్రెస్ సర్కారు కరెంటు ఇస్తున్నదని చెప్పే సందర్భంలో మంత్రి ప్రెస్మీట్లో కరెంటు పోయిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.