హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కార్యాలయానికి కరెంట్ కట్ అయ్యింది. పార్టీ ముఖ్య నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన సమయంలో అంతరాయం కలిగింది. ఉదయం 8:30గంటల నుంచి 9వరకు అంటే అరగంట వ్యవధిలో ఏకంగా ఐదుసార్లు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశమైంది. కరెంట్ సరఫరాలో సర్కారు వైఫల్యానికి ఇదే నిదర్శమని పలువురు నాయకులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు సెటైర్లు పేల్చారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని పోస్ట్‌లు పెట్టారు. కాగా, ఇది అవాస్తమని, బీఆర్ఎస్ ఆఫీసుకు కరెంట్ అంతరాయం కలుగలేదని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.