శక్కర్‌నగర్ : బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం సర్వీసులను తగ్గించిందని, ప్రయాణికులకు సరిపడా బస్సులను పెంచాలని పీవోడబ్ల్యూ పట్టణాధ్యక్షురాలు నాగమణి డిమాండ్ చేశారు.
ఫ్రీ బస్ పథకం రద్దు ప్రతిపాదనలుంటే రద్దు చేసుకోవాలని తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.