హైదరాబాద్ : రాష్ట్ర అధికార చిహ్నం(Telangana emblem) ఆవిష్కరణ వాయిదా (Postponement) పడింది. తెలంగాణ అస్తిత్వానికే ముప్పుకలిగేలా అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్, తెలంగాణ సమాజం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిహ్నంలోని కాకతీయ కళాతోరణం (Kakatiya Kalatoranam), చార్మినార్(Charminar) తొలగింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
జూన్ 2న రాష్ట్ర గీతం జయ జయయే తెలంగాణ గేయం మాత్రమే ఆవిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పష్టత రాకపోవడంతో పాటు 200 వరకు సూచనలు వచ్చినట్లు తెలిసింది. మరిన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.