హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు. బుధవారం అశోక్‌నగర్, దిల్సుక్నగర్లలో అభ్యర్థులు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాసి డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేశారు.
పీజీఈసెట్‌లో 4,320 సీట్లు భర్తీ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎంఈ, ఎంటెక్, ఎం ఆర్క్ వంటి కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన పీజీ ఈసెట్ మొదటి విడత సీట్లను బుధవారం కేటాయించారు. మొదటి వారంలోనే 78.13% సీట్లు భర్తీ అయ్యాయి. 5,529 కన్వీనర్ కోటా సీట్లకు 4,320 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి మొదటి విడత కౌన్సెలింగ్‌లో 7,471 మంది పాల్గొనగా 3,151 మంది సీట్లు దక్కించుకోలేదు. సీట్లు పొందిన వారు 10 లో గా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలని కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సూచించారు.