హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుల్లో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించింది. మీ సేవ కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. రేషన్ కార్డులో పేరు లేనివారు, పిల్లల పేర్లు, కొత్తగా పెండ్లయిన వారు తమ పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్‌లో మరో పేరు ఉన్నవారు సైతం కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ, ఎప్పటి వరకు గడువు అనేది ప్రకటించలేదు. వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యేల లేఖలకు టీటీడీ ప్రాధాన్యమివ్వాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.