హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ): క్రైస్తవ మత ఆధ్యాత్మిక బోధకుడు, పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రేమాభిమానాలతో, సుఖ శాంతులతో, విశ్వ మానవాళి జీవించాలని, జీసస్ బాటలో నడిచిన పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచ శాంతికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పోప్ మరణంతో బాధాతప్త హృదయులైన క్రిస్టియన్ మతస్థులకు, వారి అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.