జగదేవ్పూర్, జూలై 2: నిలువనీడ లేని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదంటూ ఓ నిరుపేద జంట పురుగుల మందు డబ్బాతో పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. చాట్లపల్లి గ్రామానికి చెందిన గంట స్వప్న, రమేశ్ దంపతులు. మొదటి జాబితాలో వీరికి ఇల్లు మంజూరు కాగా, రెండో జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నారు. బుధవారం వారు పంచాయతీ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. తమకు ఇల్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు. అర్హత లేని వా రికి ఇల్లు మంజూరు చేసి, అన్ని అర్హతలు న్న తమకు ఎందుకు మం జూరు చేయలేదని ప్రశ్నించారు. అర్హతలేని వారి పేర్లను తొలగిస్తామని అధికారులు తెలిపారు.