Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డుప్రమాదంలో సర్పంచ్ మృతి చెందాడు. సర్పంచ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయాల పాలైన సర్పంచ్‌ను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ హైన్స్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తాంసి మండలం పొన్నారి సర్పంచ్ సంజీవ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.