హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను రౌడీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, ఆ తిట్లను ఆశీర్వచనంగా తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నవీన్‌యాదవ్ ఉన్నత విద్యావంతుడని కితాబిచ్చారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రౌడీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే నవీన్‌యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలంయాదవ్ను స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రౌడీగా పేర్కొనడం గమనార్హం.
ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతల కోసం రౌడీలను బైండోవర్ చేయడంలో భాగంగా చిన్నశ్రీశైలంయాదవ్ను కూడా పోలీసులు బైండోవర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీని అభ్యర్థిగా నిలిపిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా మంత్రి పైవిధంగా స్పందించారు.