హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు, డ్రైవర్లకు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు -2026 (సడక్ సురక్ష – జీవన్క్ష్ర)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్లుగా డ్రైవింగ్ చేస్తూ ఒక ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు పురసారాలు అందజేశారు. ఏటా ఆర్టీసీ బస్సులతో 600 ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రతి డిపోలో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం కోసం బ్రీత్ అనలైజ్ టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే తకువ ప్రమాదాలు జరుగుతున్న రవాణా సంస్థ తెలంగాణ ఆర్టీసీ అని చెప్పారు. అంతకుముందు రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ఏటా 80 కోట్లు ప్రమాద బీమా చెల్లిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ హకమిషనర్ ఇలంబర్తి, ఈడీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఏటా 26 వేల రోడ్డు ప్రమాదాలు, 8 వేల మరణాలు సంభవిస్తుండగా రోజుకు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్లో, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎకువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదలను అరికట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, రమేశ్, శివలింగయ్య, స్టేట్ ఆర్టీఏ మెంబర్ నవీన్, జిల్లా ఆర్టీఏ సురేశ్‌లాల్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తాజాగా స్పందించారు. గురువారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తున్నదని గొప్పలు చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రగల్భాలు పలికారు. సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుల్లో 130 టీఎంసీల నీటిని నిల్వ చేశామని, 7 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరు అందిస్తామని స్పష్టంచేశారు.