Ponnam Prabhakar | కొనసాగుతున్న సమ్మె.. ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్
Ponnam Prabhakar | ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar | ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవన్నీ వెంటనే పరిష్కారమయ్యే అంశాలని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉందన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకే నాలుగు వారాల గడువు అడిగామని వివరించారు. ఈ రెండు అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని అన్నారు.
ఆర్టీసీ విలీనం ఆలస్యమైనప్పటికీ.. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని.. అన్ని అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరని.. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలపవచ్చని.. ప్రజలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. అయితే పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది కలగజేయవద్దని విజ్ఞప్తి చేశారు. మీ నాయకులు నిరసన తెలపవచ్చని.. మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

