హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): రాబోయే బడ్జెట్లో బీసీ వర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు.
2025-26 బడ్జెట్లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. 2026-27 బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలు, ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రవాణాశాఖ బడ్జెట్‌పై సంబంధిత అధికారులతో చర్చించారు.