హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గురుకులాలను ఉన్నతాధికారులు నిత్యం తనిఖీ చేయాలని, స్థాని క ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల లు, కాలేజీలపై సొసైటీ సెక్రటరీ సైదు లు, అడిషనల్ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్‌తో మంత్రి పొన్నం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గురుకులాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. ఇటీవల గురుకులాల్లో జరిగిన ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని, ఎకడైనా పొరపాటు జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణాల్లో పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్సీవోలు ఎన్ని సూల్స్ విజిట్ చేశారో.. రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.