హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
దీనికి హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.