Poonam Prabhakar | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ‘బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు కూడా వారి సామాజిక వర్గమేనని తెలిసింది. మరి ఆ ఇద్దరికీ కులసంఘం పెద్దలు పెండ్లి చేస్తరా? ఆ కుల పెద్దలు వివక్షాపూరితంగా ఆ ఇ ద్దరిలో ఒక వర్గానికే మ ద్దతుగా నిలిచి ప్రభుత్వా న్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది’ అని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఈ కేసు విషయంలో కులాల ప్రస్తావనకు ఆస్కారం లేదని హితవు పలికారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ కుమారుడిపై ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. కేంద్రమంత్రిగా ఆయనే స్వయంగా విచారణ కోరాల్సి ఉండెనని తెలిపారు. తమపై కుట్రలు చేస్తున్నారనే సానుభూతి ప్రయత్నాలను సంజయ్ ఇకనైనా ఆపాలని హితవు పలికారు. ‘ఈ కేసులో బాధితురాలు మిమ్మల్ని కలిసిన మాట వాస్తవం కాదా? ముందు మీ నిర్దోషిత్వం నిరూపించుకోవాలి’ అని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీతో మాట్లాడి కేసు విచారణకు మహిళా ఐపీఎస్ అధికారిని నియమించారని వెల్లడించారు. దోషులు ఎం తటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని చెప్పారు. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.