హైదరాబాద్, సెప్టెంబర్ 27: తన ఇండ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేయబోతున్నారనే విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా పది గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పొంగులేటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున ఆరున్నర గంటలకే బయటకు వెళ్లిపోయారని సమాచారం. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఒక చోట కూర్చొని ఫోన్ల మీద వ్యవహారాలు చక్కబెట్టారని తెలుస్తున్నది. తన కీలక అనుచరులు, తన సంస్థల్లో పని చేసే కీలక ఉద్యోగులతో ఆయన అనుక్షణం టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. మరికాసేపట్లో ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారనగా ఆయన అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకున్నారని తెలుస్తున్నది. ఈడీ సోదాల సమాచారాన్ని సైతం ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకున్నారని సమాచారం. గతంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలోనూ ఆయన ఇదే రకంగా జాగ్రత్త పడ్డట్టు చెప్తున్నారు.