‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’పై విచారణ
‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.
కూసుమంచి, మే 2: ‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో హౌసింగ్ పీడీ సహా ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఆమె కొడుకును ఎన్నారైగా పరిగణించలేమని, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాకే అతడు బ్యాంకు రుణంతో లండన్ వెళ్లాడని, ఆమె కూతురు కూడా పీజీ పూర్తిచేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నదని విచారణలో తేల్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరులో గత నెల 29న ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో పాలేరుకు చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు మైక్ తీసుకొని మాట్లాడారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, నలుగురు సంతానంలో ఒకరు లండన్‌లో చదువుకుంటున్నారని, మరొకరు విద్యుత్తురంగంలో ఉద్యోగం చేస్తున్నారని, ఇంకొకరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
వెంటనే మంత్రి స్పందిస్తూ.. ‘వీరికి ఇందిరమ్మ ఇంటిని ఎలా మంజూరు చేశారు?’ అంటూ సర్పంచ్‌ను ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు లబ్ధిదారుకు ఏ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇచ్చారో తేల్చాలంటూ ఖమ్మం కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్ పీడీ సహా ఇతర అధికారులు వెళ్లి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. సదరు లబ్ధిదారు కుటుంబ నిరుపేద కుటుంబమేనని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆమెకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశామని తేల్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

