హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తనపై వచ్చిన ఆరోపణల ను ఖండించాలంటూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ నేతలను బతిమాలుకుంటున్నారు. శాసనసభలో హరీశ్‌రావు పొంగులేటికి చెందిన సంస్థలపై ఆరోపణలు చేయడంతోపాటు వా టికి ఆధారాలు సైతం చూపిన సంగతి తెలిసిందే. వాటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు రాకపోవడంతో చివరికి మంత్రి స్వయంగా రంగంలోకి దిగి బుధవారం విలేకరుల సమావేశం పెట్టారు.
ప్రెస్మీట్లో తాను మాట్లాడింది రివర్స్ అయ్యింద ని, జనంలో నవ్వులపాలయ్యానని భా వించినట్టు తెలిసింది. అందుకే తనకు మద్దతుగా రావాలంటూ పీసీసీ అధ్యక్షుడితోపాటు కాంగ్రెస్ నేతలకు గురువా రం ఉదయం నుంచి మంత్రి స్వయం గా ఫోన్లు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మంత్రి పొంగులేటి గురువారం జిల్లా పర్యటనల్లో పాల్గొనాల్సి ఉందట. వాటన్నింటిని పక్కకుపెట్టి సచివాలయానికి వచ్చారని చెప్తున్నారు.
పలువురు ఎమ్మెల్యేలు, కా ర్పొరేషన్ల చైర్మన్లు, ఇతరులతో స్వయం గా మాట్లాడారని సమాచారం. మీడి యా సమావేశం నిర్వహించి, ఏమేం మాట్లాడాలో పా యింట్లు కూడా రాసి పంపినట్టు తెలిసింది. రెవెన్యూశాఖ మంత్రి కావడం, బతిమాలుతుండటంతో తప్పని పరిస్థితుల్లో కొందరు నేతలు ప్రెస్మీట్లు పెట్టి మమ అనిపించారు. అందుకే ఉదయమే పార్టీ సోషల్ మీడి యా విభాగం వాళ్లతో, ఆ తర్వాత ఓ ఇద్దరు కార్పొరేషన్ల చైర్మన్లు, ఓ ఎమ్మె ల్యే, ఒక ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఇలా పలువురితో ప్రెస్మీట్లు పెట్టించినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి. మంత్రే తమకు ఫోన్లు చేసి ప్రెస్మీట్లు పెట్టాలని చెప్పారని పలువురు నేతలు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా చెప్పారు.