TG Polycet 2025 | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష ఈ నెల 13న జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. 276 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా, మొత్తం 1,06,716 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
గంట ముం దే పరీక్షకు అనుమతించనుండగా, నిమిషం ఆలస్యమైనా వెనక్కి పంపించనున్నారు. సెంటర్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎస్బీటెట్ టీజీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.