రెమ్యునరేషన్ తగ్గింపుపై పోలింగ్ సిబ్బంది నిరసన
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వర్తించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది రెమ్యునరేషన్ తగ్గించి ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. రూ.1,300 కుగాను రూ.800 ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు, జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్లోని స్ట్రాంగ్ రూం కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
నారాయణపేట/వడ్డేపల్లి/జనగామ/కృష్ణకాలనీ, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వర్తించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది రెమ్యునరేషన్ తగ్గించి ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. రూ.1,300 కుగాను రూ.800 ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు, జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్లోని స్ట్రాంగ్ రూం కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
వడ్డేపల్లిలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన పీవో, ఏపీవోలు, ఓపీవోలకు సక్రమంగా రెమ్యునరేషన్ ఇవ్వకపోడంతో పోలింగ్ బాక్సులు ఇవ్వమని భీష్మించారు. జనగామ, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన పోలింగ్ సిబ్బంది బుధవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఇతర జిల్లాల్లో రెండు రోజుల విధులకు రూ. 1,300 చెల్లిస్తే తమకు మాత్రం కోత పెట్టడం ఏమిటని అధికారులను నిలదీశారు. కోత లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

