రేపే పోలింగ్
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానున్నది.
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
- రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు,
- 7 కార్పొరేషన్లలో పూర్తయిన ఏర్పాట్లు
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమీక్ష
- ముగిసిన ప్రచారం.. ప్రలోభాలు మొదలు
- పలుచోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగం
- పోలింగ్ కేంద్రాలకు నేడు బ్యాలెట్
- బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపు
- ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, పోలీస్
- కమిషనర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు.. ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో వెల్లడికానున్నది. ఆ రోజే నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉతంఠకు తెరపడనున్నది. జిల్లాలవారీగా ఏర్పాటుచేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగళవారం నుంచి తరలించనున్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ బాక్సుల తరలింపు
బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ప్రతి పోలింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గు ర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్రంలో ఈ నెల 11న జరుగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ ఏసీ గార్డ్స్‌లోని ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులతోపాటు, ము ఖ్యంగా తొమ్మిది జిల్లాల (మెదక్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, ము లుగు, నిర్మల్) కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ కోసం సిబ్బం ది నియామకం, వారికి అందించిన శిక్షణపై సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
అంకెల్లో పురపోరు
- 116 మున్సిపాలిటీలు: 2,582 వార్డులు
- 7 మున్సిపల్ కార్పొరేషన్లు: 414 డివిజన్లు
- మొత్తం 123 యూఎల్బీలు: 2,996 వార్డులు
- బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు: 12,944 మంది
- రాష్ట్రంలో మొత్తం 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి
- అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్‌కాస్టింగ్
- 11,000కి పైగా స్మార్ట్ కెమెరాలతో పర్యవేక్షణ
- రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన జనవరి 27 నుంచి శుక్రవారం వరకు పట్టుకొన్న సొత్తు రూ.2.02 కోట్లకుపైగా
- ఫిర్యాదులకు ఎస్ఈసీ ప్రత్యేక హెల్ప్‌లైన్ 9247597066
- ఎన్నికల పర్యవేక్షణకు 9 మంది ముఖ్య నోడల్ అధికారులు
ఎన్నికల సిబ్బంది
- జోనల్ అధికారులు:742
- ఎఫ్ఎస్టీ బృందాలు:279
- ఎస్ఎస్టీ బృందాలు:381
- రిటర్నింగ్ అధికారులు(ఆర్వోలు):1,379
- అసిస్టెంట్ ఆర్వోలు:1,547
- పోలింగ్ అధికారులు:9,560
- ఇతర పోలింగ్ అధికారులు:31,428
- మొత్తం పోలింగ్ కేంద్రాలు:8,203
- బ్యాలెట్ బ్యాక్సులు: 16,031
- స్ట్రాంగ్ రూమ్‌లు:137
- కౌంటింగ్ కేంద్రాలు: 136
- మొత్తం ఓటర్లు:52.43 లక్షలు
- ఫురుషులు:25.62 లక్షలు
- మహిళలు:26.80 లక్షలు
- ఇతరులు:640 మంది
123 యూఎల్బీల్లోని 2,996 వార్డుల రిజర్వేషన్లు ఇలా..
- బీసీ జనరల్: 463
- బీసీ మహిళ: 391
- ఎస్సీ జనరల్: 254
- ఎస్సీ మహిళ: 190
- ఎస్టీ జనరల్: 147
- ఎస్టీ మహిళ: 40
- అన్‌రిజర్వుడ్ జనరల్: 647
- అన్‌రిజర్వుడ్ మహిళ : 864
పార్టీలవారీగా బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య
- కాంగ్రెస్: 2,948
- బీఆర్ఎస్: 2,878
- బీజేపీ: 2,634
- జేఎస్పీ: 332
- ఏఐఎఫ్బీ: 288
- ఎంఐఎం: 282
- బీఎస్పీ: 213
- సీపీఐ: 168
- సీపీఎం: 128
- ఆప్: 38
- ఐయూఎంసీ: 9
- ఇతర గుర్తింపు
- పొందిన పార్టీలు: 240
- స్వతంత్రులు: 2,786
- మొత్తం:12,944
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

