ఉత్సాహంగా కదిలిన కొత్త ఓటర్లు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అనేకచోట్ల ఓటర్లు అప్పటికే క్యూకట్టారు. మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగిన ఆ తరువాత మళ్లీ ఓటింగ్ శాతం పుంజుకున్నది.
- తరలివచ్చిన వృద్ధులు, దివ్యాంగులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి 9.30 వరకు కొనసాగిన పోలింగ్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అనేకచోట్ల ఓటర్లు అప్పటికే క్యూకట్టారు. మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగిన ఆ తరువాత మళ్లీ ఓటింగ్ శాతం పుంజుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు పలుచోట్ల రాత్రి 9.30 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. వీరంతా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చోడంతో పోలింగ్‌కు అవకాశం కల్పించారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు ఉత్సాహంగా కనిపించారు. ఓటు వేసి వచ్చి సిరా గుర్తు చూపుతూ ఫొటోలు దిగారు.
వృద్ధులు, దివ్యాంగులు సైతం భారీగా కదిలివచ్చారు. వీరి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్‌చైర్లతోపాటు సహాయకులను అందుబాటులో ఉంచారు. సిద్దిపేట పట్టణంలోని బారాయిమామ్కు చెందిన 104 ఏండ్ల వృద్ధురాలు జోహరబీ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి నాసర్‌పురా పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకొని పలువురికి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటలో నవ దంపతులు ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన నిండు గర్భిణి మాధవికి మధ్యాహ్నం పురిటి నొప్పుల మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లగా ఓటు వేసింది.
అనంతరం ఆమెను 108లో అయిజ పీహెచ్‌సీకి తరలించగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తిలో జంట కవలలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచలో జక్కుల రాములు అనే వ్యక్తి మరణించగా, ఆయన కుమారుడు, సోదరుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో తమ ఓటు వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

