BRS | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మేధావులు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. వీరికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో చంద్రాపూర్ డీసీబీ బ్యాంక్ మాజీ డైరెక్టర్, జిల్లా సహకారి బోర్డ్ ఉపాధ్యక్షుడు, ఎన్సీపీ బరోరా పూర్వ అధ్యక్షుడు వసంత్ మరోట్రావ్ విధాతే, మాజీ మంత్రి వామన్‌రావు గదంవార్ సోదరుడు, సహోలీ చంద్రాపూర్ జడ్పీటీసీ సతీశ్ గదంవార్, పత్రికా ఎడిటర్, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆశీష్ ఘూమే, చంద్రాపూర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల నేత అమిత్దేవ్రావ్ కంకే, భద్రావతినగర్ పరిషత్ సేవక్ రాహూల్ సొంటకే, గోర్దా మాజీ సర్పంచ్ మనోహర్ డోర్లికార్, ఆనంద్ యెంగ్నే, ఆనంద్ టెంగ్నే, గణేశ్ కేశవరావ్ దరి, నందకిశోర్, నాగపూర్ డివిజన్ నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు నరహరి బాహుగవాయి, బుల్దానా జడ్పీ చైర్మన్ శాంబావు హతాడే, బాలాసాహెబ్ దామోదర్, రూపేశ్‌కుమార్ గవాయి, విష్ణుపాటిల్, ఏ బాలచందర్ తదితరు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.