హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధవిరోధులే అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలనలో లెక్కకు మిక్కిలి పాలనా వైఫల్యాలు బయటపడ్డాయి.
భూ కబ్జాలు, హత్యలు, లైంగికదాడులు వం టివి తరచూ జరుగుతున్నా కేంద్ర మంత్రు లు బండి సంజయ్, కిషన్రెడ్డి సహా ఇతర బీజేపీ ముఖ్య నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయనేలేదు. దీనికి ప్రతిగా బీజేపీ నేతల వారసులు ఎన్ని నేరాలు చేసినా చట్టానికి అతీతంగా రేవంత్రెడ్డి ప్రభు త్వం వెనుకేసుకొస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బాలికను లోబరుచుకున్న విషయం ఐదు నెలల క్రితమే ముఖ్యనేతకు తెలుసని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. నిరుడు డిసెంబర్ నెలలోనే ఆ బాలిక వికారాబాద్ జిల్లాలోని ఒక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సదరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ఈ విషయాన్ని అప్పటి డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. డీజీపీ వెంటనే ముఖ్యనేతకు వివరించారని, ఆయన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆపినట్టు చర్చ జరుగుతున్నది. అయినా ఆ బాలిక పట్టు వదలలేదట.
తనకు న్యాయం చేయాల్సిందేనని పోరాడుతుండటంతో భయపెట్టడానికి ముఖ్యనేత ఆదేశాలతోనే కరీంనగర్ పోలీసులు ఆ బాలికపై హనీట్రాప్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఉన్నప్పుడే ముఖ్యనేత ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు వేగంగా స్పందించి హనీట్రాప్ కేసు నమోదు చేశారని ప్రచారం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్ ఎంపీగా పోటీచేసిన బండి సంజయ్ సునాయాసంగా గెలువడానికి వీలుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందనే విమర్శలొచ్చాయి.