BRK Bhavan | హైదరాబాద్ : బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించడమే కాదు.. వారి చేతుల్లో వందలాది లాఠీలు ఉన్నాయి. ఇక బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ దారులను మూసివేయడంతో.. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్కే భవన్ వద్దకు తరలివచ్చారు. కేసీఆర్‌కు మద్దతుగా జై కేసీఆర్.. జై తెలంగాణ అని నినాదాలు చేశారు. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నినాదాలు చేసి.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
మొత్తంగా బీఆర్కే భవన్ పరిసరాలు పోలీసులతో మోహరించడంతో.. పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా ఉద్యోగాలకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.