Harish Rao | అప్పా జంక్షన్ వద్ద హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డంగా లారీలు!
Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు.
Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు బయల్దేరారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల దయాకర్‌రావుతో కలిసి ఆయన పరిగికి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు.
పరిగికి చేరుకోకుండా హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్‌రావు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. రైతులకు భరోసాగా వెళ్తున్న హరీశ్‌రావును అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించిన ఆందోళన చేపట్టారు. దీంతో అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి @BRSHarish గారిని మార్గమధ్యంలో అప్ప జంక్షన్ అడ్డుకున్న పోలీసులు.
వికారాబాద్ జిల్లా పరిగికి చేరుకోకుండా పోలీసుల అడ్డగింత.
రైతులకు భరోసాగా వెళ్తున్న హరీశ్ రావును అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం.పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న… pic.twitter.com/OeObZ1Cbh6
— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026
పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య పరిగి రైతుల వద్దకు బయల్దేరిన మాజీ మంత్రి @BRSHarish గారు
హరీశ్ రావు గారి వెంట బయల్దేరిన మాజీ మంత్రులు @BrsSabithaIndra గారు, @EDRBRS గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, దివాకర్ రావు గారు, మాజీ చైర్మన్ @DrErrolla గారు,… pic.twitter.com/5Jgspji7vx
— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

